కేంద్రం ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై నేడు అధికారికంగా ప్రకటన చేసింది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బేషరతుగా ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఉక్కు పరిశ్రమ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఉక్కు పరిశ్రమ పూర్తి స్థాయి ఉత్పాదకతతో లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ ఓ నిదర్శనమని రామ్మోహన్ వివరించారు.
జగన్ అవినీతి ఆరోపణల పై లక్ష్మీనారాయణ క్లారిటీ!