telugu navyamedia
సినిమా వార్తలు

“దండుపాళ్యం”కు సెన్సార్ షాక్

Cinestar Tanshika injoured shooting
బెంగుళూరు దగ్గర దండుపాళ్యంలో జరిగిన హైవే దోపిడీ దొంగల ముఠా కిరాతకాలను దృశ్యరూపంలో “దండుపాళ్యం” గా తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా నాలుగవ భాగం “దండుపాళ్యం-4” గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రబృందానికి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. సినిమా ప్రారంభం నుంచే లైంగికంగా వేధించడం వంటి సన్నివేశాలు, మహిళల వస్త్రధారణ వంటివి అసభ్యకరంగా ఉన్నాయని, సినిమాలో అసలు సందేశమే లేదని, ఇంత జుగుప్సాకరంగా, అభ్యంతరకరంగా ఉన్న సినిమాను ప్రేక్షకులు చూడడానికి తాము అంగీకరించేది లేదని తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది సెన్సార్ బోర్డు. 
అయితే సినిమాలో సన్నివేశాలను తొలగించాలనో, లేదంటే రీషూట్ చేయాలనో చెప్పకుండా కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాను ఇలా తిరస్కరించడం ఏమిటంటూ చిత్ర నిర్మాత వెంకటేష్ ప్రశ్నించారు. అంతేకాదు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలిని ఆశ్రయించడంతో పాటు కేంద్ర సెన్సార్ బోరుకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంకా ఈ విషయంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలిపారు. ఐదు భాషల్లో భారీగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నామని, అలాంటిది సినిమాకు అసలు సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts