telugu navyamedia
రాజకీయ

జాతిపితకు ప్రముఖుల నివాళులు

భారత జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి నేడు. ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు గాంధీజీ అహింసే ఆయుధంగా దేశం కోసం, ధర్మం కోసం శాంతి కోసం పోరాడిన బాపూజీ జీవన మార్గం ప్రతీ భారతీయుడికి అనుసరణీయం. స్వాతంత్య్ర సమరయోధుడిగా, అహింసా వాదిగా యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ కార్యాచరణ మనందరికి స్ఫూర్తిదాయకం.

Sonia Gandhi Modi, Others Pays Tribute to Mahatma Gandhi On His 152 Birth Anniversary - Sakshi

 

గాంధీ జయంతిని సందర్భంగా దేశ నేతలు, ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాత్ముడికి ఘన నివాళులు అర్పించారు. బాపు జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి మంచి మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని కొనియాడారు. ఆయనతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోమంత్రి అమిత్‌ షా గాంధీజీకి నివాళులు అర్పించారు.

 

Related posts