Case against Rajinikanth in thoothukudi

రజినీ పై కేసు నమోదు…

20

తూత్తుకూడి సంఘటనలో ఉద్యమకారుల్ని సంఘ విద్రోహ శక్తులతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రజినీకాంత్ కి తల నొప్పిగా మారాయి. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టిన సమయంలో ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పులను దృష్టిలో పెట్టుకొని రజినీకాంత్ నోరుజారారన్న విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో ఉద్యమ కారుల్ని సంఘ విద్రోహశక్తులుగా పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. సదరు వ్యాఖ్యలకు కింది కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు మద్రాస్ హైకోర్టు నిన్న సూచించింది. అలాగే కాల్పుల సంఘటనపై తగిన అంశాలను పరిశీలంచాలని, నిందితులను గుర్తించాలని కేసును సీబీసీఐడీ కి అప్పగించగా, తూత్తుకుడిలో విచారణ కూడా మొదలయింది.

Case against Rajinikanth in thoothukudi

తూత్తుకుడిలో స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేసిన చేసిన నిరసనలో మే 22, 23 వ తేదీల్లో పోలీసులు అక్రమంగా కాల్పులు జరపడంతో 13 మంది మరణించారు, పలువురు గాయాలపాలయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటన పలువురిని కలవర పెట్టింది. బాదితులను పరామర్శించడానికి తమిళనాడు లోని అన్ని పార్టీలు వెళ్లగా, దక్షిణ భారతదేశ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా పరామర్శించడానికి వెళ్లారు. అయితే మీడియా ముందు మాట్లాడుతున్న సమయంలో పోలీసులు జరిపిన కాల్పులను, కాల్పులకు దారి తీసిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుండగా, నోరు జారిన రజినీకాంత్ ఉద్యమ కారులు సంఘ విద్రోహ శక్తులుగా మారారు అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ హొసూరు శిలంబరసన్ అనే వ్యక్తి పోలీసులని ఆశ్రయించి, క్రిష్ణగిరి జిల్లాకు సూపరింటెండెంట్ కు పిర్యాదు చేశారు. రజిని పై కేసు నమోదు చేయాలనీ తెలుపగా, పోలీసులు పట్టించుకోలేదు.

దీన్ని అస్త్రంగా పెట్టుకున్న శిలంబరసన్, న్యాయం కోసం ఏకంగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అతను వేసిన పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి ప్రకాష్, మొదట కింది కోర్టును ఆశ్రయించకుండా హైకోర్టు కు ఎలా పిటిషన్ వేశావని శిలంబరసన్ ను ప్రశ్నించాడు. దీనితో కింది కోర్టును ఆశ్రయించాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు.

Case against Rajinikanth in thoothukudi

తమిళనాడులో కిందికోర్టు ఏవైనా ఆదేశాలు జారీ చేస్తుందా, రజినీకాంత్ పై కేసు నమోదు చేయనుందా అన్న ప్రశ్న కలకం లేపుతుంది. ఒకవైపు రజిని చేసిన వ్యాఖ్యలు సమాజానికి విరోదంగా ఉన్నాయని, సెలెబ్రెటీ పొజిషన్ లో ఉన్న వ్యక్తి తప్పుడు వ్యాఖ్యలు ఎలా చేస్తారని వ్యతిరేక బావాలు మొదలయ్యాయి. ఒకవైపు రజిని పై కేసు నమోదు చేస్తే అభిమానులు ఎలా వ్యవహరిస్తారన్న అంశంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి.

Case against Rajinikanth in thoothukudi

తూత్తుకుడి కాల్పుల ఘటనపై సీబీసీఐడీ విచారణకు చేపట్టింది. బుధవారం రోజున పోలీసు విభాగం సూపరిండెంట్ ప్రవీణ్ కుమార్ అభినవ్ నేతృత్వంలో తూత్తుకుడికి చేరుకున్నాయి. అక్కడి సీబీసీఐడీ కార్యాలయంలో సిబ్బందితో భేటీ అనంతరం సంఘటన జరిగిన ప్రాంతాల్లో అభినవ్ విచారణ చేపట్టాడు. కాల్పుల ఘటన, అల్లర్లకు దారితీసిన పరిస్థితులను శ్రీగ్రంగా అధ్యయనం చేసి, జిల్లా ఎస్పీ మురళీ రంభతో భేటీ అయ్యారు.
స్థానిక పోలీసులు నమోదు చేసిన ఐదు రకాల సెక్షన్లతో కూడిన కేసుల వివరాల్ని పరిశీలించి తమదైన శైలిలో విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సీబీసీఐడీ ఎస్సీ అభినవ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.