telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా ప్రభావం… కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వాయిదా

canes

సినీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ పడగా కొన్ని మూవీల విడుదల వాయిదా పడింది. దీని విస్తరణ రోజురోజుకు ఎక్కువవుతోన్న నేపథ్యంలో ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కూడా వాయిదా పడింది. ఈ ఉత్సవాలను వాయిదా వేసినట్లు ద‌క్షిణ ఫ్రాన్స్‌లోని కేన్స్ నిర్వాహ‌కులు తెలిపారు. మే 12 నుండి 23వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉన్న ఈ కార్య‌క్ర‌మాన్ని జూన్ చివ‌రిలో గానీ జూలైలో నిర్వ‌హిస్తామ‌ని వారు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాగా కేన్స్‌లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది సినీ నిర్మాతలు, ప్రముఖులు మరియు కార్యనిర్వాహకులు ఫ్రెంచ్ నగరానికి రావాల్సి ఉంది. అయితే కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని కొద్ది రోజుల పాటు ర‌ద్దు చేస్తేనే మంచిద‌ని భావించిన మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కేన్స్‌లో గెలుపొందిన సినిమాల‌ని బ‌ట్టే ఆస్కార్ రేసు కూడా ఉంటుంది.

Related posts