telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ జరగనుంది.

ఎస్ఐపీబీ సమావేశంలో రూ.85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుతో పాటు, ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే అంశంపై మంత్రివర్గంలో చర్చించి, వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

సూపర్ సిక్స్ పథకాల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తెలిపే అవకాశం ఉంది.

Related posts