telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అహ్మదాబాద్‌ : … పండగపూట.. సీఏఏ పతంగుల డిమాండ్ సూపర్..

CAA kites on sankranthi by

కేంద్రప్రభుత్వం ఇటీవల చేసిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఓ వైపు ఆందోళనలు సాగుతున్నా.. అధికారపక్షం మాత్రం సీఏఏ యాక్ట్‌ తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకొస్తుంది. తాజాగా మకర సంక్రాంతి సందర్భంగా గుజరాత్‌ లో సీఏఏ యాక్ట్‌ అనుకూల, వ్యతిరేక పతంగులు దర్శనమిచ్చాయి. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సీఏఏకు మద్దుతుగా పతంగులు ఎగరేశారు.

రెండు వర్గాల (కాంగ్రెస్, బీజేపీ) కు చెందిన నేతలు గగనతలంలో ఈ పతంగులను ఎగురవేశారు. ‘సీఏఏకు మద్దతునిస్తున్నాం..మేం సీఏఏకు వ్యతిరేకం..సీఏఏ భారత్‌కు వ్యతిరేకం. నో ఎన్‌పీఆర్‌..నో ఎన్‌సీఆర్‌. సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌-సేవ్‌ ఇండియా, హిందూ ముస్లిం భాయీ భాయీ..ఎన్‌ఆర్‌సీ-సీఏఏ బై బై’ అనే సందేశాలు రాసి ఉన్న గాలిపటాలను అధికార పక్షం బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు ఎగురవేశారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సీఏఏకు మద్దుతుగా పతంగులు ఎగరేశారు.

Related posts