ప్రస్తుతం హీరో నితిన్ మహానటి కీర్తీ సురేష్ జంటగా నటించిన సినిమా రంగ్‌దే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను లాక్‌డౌన్ తరువాత కూడా ఎంతో ప్రణాళికా బద్దంగా పూర్తి చేశారు. ఈ సినిమా వెంకి దర్శకత్వం వహించాడు. దీనిని సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ పాట విడుదలైంది.”బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే ” అంటూ సాగె ఈ పాట పెళ్లి తర్వాత ఓ మగాడి జీవితం ఎలా మారిపోతుంది అనేదాని వినోదభరితంగా వివరించారు. అయితే ఈ సినిమా హోళీ సందర్బంగా మార్చి 26న అభిమానుల ముందుకు రానుంది. దాంతో చిత్రబృందం ఇప్పుడు ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. భీష్మా వంటి బ్లాక్ బస్టర్ తరువాత నితిన్ హీరోగా నటించిన చెక్ నిన్న విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతోఅభిమానుల్లో ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో నితిన్ అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.
previous post
వీళ్లకు అసలు సిగ్గు, శరం లాంటివి ఏమైనా ఉన్నాయా?… కత్తి మహేష్ పై మాధవీలత ఫైర్