bus accident in manipur

అధికారుల నిర్లక్ష్యధోరణి….మృత్యుశకటాలవుతున్న బస్సులు…

26

మణిపూర్ లో బస్సు డివైడర్ ను ఢీకొనటంతో బోల్తాకొట్టింది.  ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మంది గాయాలపాలయ్యారు.  గడువు తీరిపోయిన బస్సు కావటంతో చిన్న ప్రమాదానికి బోల్తాకొట్టటంతో ఈ విషాదం చోటు చేసుకుంది.  ప్రమాదసమయంలో బస్సులో 60 నుండి 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ బస్సు ఫార్రుఖాబాద్ నుండి జైపూర్, రాజస్థాన్ వెళ్తుందని మణిపురి అదనపుఁ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ ఓం ప్రకాష్ సింగ్ తెలిపారు. 

సదరు బస్సు డివైడర్ ను ఢీకొట్టడంతో బోల్తాపడింది, ప్రమాదం జరిగిన స్థలం జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో మైనపురి-ఇటావా రోడ్ లో జరిగిందని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతానికి 17 మంది చనిపోగా 20 మంది వరకు గాయాలపాలయ్యారని, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఎడమ కాలు పోయిందని ప్రస్తుతం సైఫై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారి తెలిపారు. 

గాయాలపాలైన వారిని సైఫై, మైనపురి ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు ఆగ్రా కి చెందినవారిగా గుర్తించగా వారు సైఫై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  బస్సులో ఉన్నవారందరూ ఇటుక బట్టీలలో పనిచేసే వారని, పని పూర్తిచేసుకొని ఇంటికి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారి తెలిపారు.  

బస్సు నెంబర్ బట్టి ఫార్రుఖాబాద్ లో రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది, మిగిలిన వివరాలు తెలియాల్సి ఉందని అధికారి తెలిపారు. బస్సు పై నిద్రిస్తున్న వారు ప్రమాదంలో మృతి చెందినట్టు తెలుస్తుంది.