telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

బుమ్రా పెళ్లి విషయంలో మరో పేరు బయటికి…

భారత పేసర్ బుమ్రా పెళ్లి గురించి రోజుకో వార్త చెక్కర్లు కొడుతూనే ఉంది. అయితే బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే దానిపై చాలా రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ నడిచింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో బుమ్రా వివాహం జ‌ర‌గ‌నుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ గాలి వార్తలే అని అటు అనుపమ తల్లి, ఇటు బుమ్రా తల్లి క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా స్పోర్ట్స్ కామెంటేట‌ర్ సంజ‌నా గ‌ణేష‌న్ పేరు వెలుగులోకి వ‌చ్చింది. ప్రస్తుతం సంజనా, బుమ్రా ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌‌, వన్డే వరల్డ్ కప్‌తో సహా పలు క్రీడా ఈవెంట్లకు స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే బుమ్రాతో ఏర్పడిన పరిచయం పరిణయానికి దారి తీసిందని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతేకాదు త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి వివాహానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల పై ఎవరు ఏ విధంగా స్పందిస్తారు అనేది. 28 ఏళ్ల సంజనా గణేషన్‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.

Related posts