telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఏలూరు జిల్లాలో విషాదం.. విద్యుత్‌ షాక్‌కు అన్నదమ్ములు బలి

ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వివరాల్లోకి వెళితే…

జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర, ఫణీంద్ర సోదరులు. పెద్దవాడు బిటెక్, చిన్నవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఇద్దరు పిల్లలను చదవించుకుంటున్నారు.

అయితే తండ్రికి అనారోగ్యంగా వుండటంతో నాగేంద్ర, ఫణీంద్ర ఇద్దరూ ఇవాళ తెల్లవారుజామున పాలు పితకడానికి పొలానికి వెళుతుండగా ఘోరం జరిగింది. రాత్రి ఎప్పుడో 11 కేవీ విద్యుత్ తీగలు తెగి పుంత రహదారిపై పడ్డాయి. గ్రామస్తులు కానీ విద్యుత్ శాఖ అధికారులు గానీ ఇది గమనించలేదు.

దీంతో అన్నదమ్ములు బైక్ వెళుతుండగా విద్యుత్ వైరు తెగి
బైక్ మీద ప‌డ‌డంతో.. ఒక్కసారిగా బైక్ కు మంటలు అంటుకుని రెప్పపాటులో సోదరులిద్దరికి అంటుకున్నారు. దీంతో ఇద్దరు యువకులు సజీవదహనమై అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
 చేతికందివచ్చిన కుమారులిద్దరూ మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది.

దీంతో దేవులపల్లిలో విషాదం అలుముకుంది. వీరి మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Related posts