telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఇద్దరికంటే మించి జ‌నం ఉండొద్దు: బ్రిట‌న్‌ ప్ర‌ధాని హెచ్చరిక

Britan pm Boris jonnson

క‌రోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కొత్త నిబంధనలను ప్ర‌క‌టించారు. టీవీల్లో జాతిని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. రోజులో ఒకేసారి మాత్రం ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాల‌న్నారు. ప‌నిచేసే ప్ర‌దేశానికి వెళ్లేందుకు ఈ వెస‌లుబాటు క‌ల్పించారు. ఎక్క‌డ కూడా ఇద్ద‌ర్ని మించి జ‌నం గుమ్మికూడ‌వ‌ద్దు అని ప్ర‌ధాని హెచ్చ‌రించారు.

ఒక‌వేళ ప్ర‌జ‌లు ఈ నియ‌మావ‌ళిని పాటించ‌ని ప‌క్షంలో పోలీసులు త‌మ అధికారాల‌ను వినియోగిస్తార‌న్నారు. క‌నీసం మూడు వారాల పాటు ఈ నిషేధ ఆజ్ఞ‌లు ఉంటాయ‌ని తెలిపారు. కేవ‌లం అత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను మాత్ర‌మే ఖ‌రీదు చేసేందుకు షాపుల‌కు వెళ్లాలి. వైద్య అవ‌స‌రాల కోసం వెళ్ల‌వ‌చ్చు అన్నారు. నిత్యావ‌స‌రాలు కాన‌టువంటి వ‌స్తువుల‌ను అమ్మే షాపుల‌ను మూసివేశారు. బ్రిట‌న్‌లో క‌రోనా వ‌ల్ల మృతి చెందిన వారి సంఖ్య 335కు చేరుకొంది.

Related posts