brahhmins got angry on jagan

జగన్ ఫై ఆంధ్ర బ్రాహ్మణుల ఆగ్రహం

24

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘము ఆత్మీయ సభను రాజమండ్రి లో ఏర్పరిచారు . ఈ సభకు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ద్వారా జగన్ ను ఈ ఆత్మీయ సభకు ఆహ్వానించారు. ఐతే జగన్ వస్తే బ్రాహ్మణుల కష్టాలు చెప్పుకోవాలనే ఉదేశ్యం తో ఈ రోజు ఈ సభను ఏర్పరిచారు. కానీ జగన్ ఈ సభకు రాకుండానే వెళ్లిపోయారు.బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన వెంకట్  ఎమ్మెల్యే చెప్పినప్పటికీ రాలేదని వాపోయారు.13 జిల్లాల నుండి సుమారు 800 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారన్నారు ఇంతమంది జగన్ కోసం వస్తే అయన సమావేశానికి రాకుండా పోవడం ఎంతవరకు సమంజసం అన్నారు . 13 జిల్లాలో వైస్సార్సీపీ నాయకులను బహిష్కరిస్తామన్నారు. త్వరలో చేసే బస్సు యాత్రలో జగన్ గురించి ఊరూరా చెబుతామన్నారు.బ్రాహ్మణులను జగన్ అగౌరవపర్చారన్నారు.