BREAKING NEWS:

ఫిలిం నగర్ దైవ సన్నిధానం లో బ్రహ్మోత్సవాలు

62

పరమహంస ,పరివ్రాజకాచార్య , సద్గురు శంకర చార్య శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో , దేవాలయ పాలక మండలి సౌజన్యంతో , అర్చక స్వాముల ఆధ్వర్యంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23న ప్రారంభమవుతాయని విశాఖ శ్రీ శారదా పీఠ ధర్మాధికారి జి. కామేశ్వర శర్మ తెలిపారు .
ఆలయ చైర్మన్ డాక్టర్ మంచు మోహన్ బాబు గారి నేతృత్వంలో 23 నుంచి 27 వరకు అంత్యంత వైభవంగా జరుగుతాయని ఆయన చెప్పారు .

23వ తేదీ ఉదయం 7. 00 నుంచి గణపతి పూజతో స్వామిజీ వారికి గురువందనం , శ్రీ సకల సిద్ది విఘ్నేశ్వర స్వామి వారికీ , శ్రీ మల్లికార్జున స్వామి వారికి విశేష పంచామృతాభిషేకం తో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని కామేశ్వర శర్మ తెలిపారు .

ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో 27 వరకు ప్రతిరోజు విశేష పూజలు జరుగుతాయని , సద్గురు శంకర చార్య శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో , చైర్మన్ మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు , “ఆగమ ప్రవర” శ్రీమాన్ ఎన్ ఎస్ కె ఆర్ భట్టా చార్యులు తెలిపారు .
ఈ ఐదు రోజులు జరిగే కార్యక్రమాలలో పాలకమండలి సభ్యులు ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆయన చెప్పారు