telugu navyamedia
సినిమా వార్తలు

విక్రమ్ ల్యాండర్ గురించి హాలీవుడ్ హీరో కామెంట్

BRad-Pit

హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ త‌న రాబోయే చిత్రంలో ఆస్ట్రోనాట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. యాడ్ ఆస్ట్రా సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా… న్యూయార్క్‌లోని నాసా ప్ర‌ధాన‌కార్యాల‌యం నుంచి హీరో బ్రాడ్‌.. అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమ‌గామి హేగ్‌తో మాట్లాడారు. 20 నిమిషాల పాటు ఆ సంభాష‌ణ సాగింది. అయితే హీరో బ్రాడ్ పిట్‌.. చంద్రుడి ఉప‌రిత‌లంపై కూలిన విక్ర‌మ్ ల్యాండర్ గురించి వ్యోమ‌గామి హేగ్‌ను అడిగారు. దానికి ఆయ‌న నో అని రిప్లే ఇచ్చారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు చూడ‌లేక‌పోయామ‌న్నారు. తాము కూడా వార్త‌ల ఆధారంగానే విక్ర‌మ్ మిస్సైన విష‌యాన్ని తెలుసుకున్న‌ట్లు చెప్పారు. చంద్ర‌యాన్ మిష‌న్‌లో భార‌త్‌కు అమెరికా స‌హ‌క‌రిస్తుంది కదా అన్న ప్ర‌శ్న కూడా బ్రాడ్ పిట్ వేశారు. ఇలాంటి విష‌యాల్లోనే అంత‌ర్జాతీయ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌న్న అభిప్రాయాన్ని వ్యోమ‌గామి హేగ్ వినిపించారు. అంత‌రిక్షం చాలా విశాల‌మైంద‌ని, అంత‌రిక్షంలో ఎటువంటి ప్ర‌యోగం చేప‌ట్టాల‌న్నా అది రోజు రోజుకు మ‌రీ క్లిష్టంగా మారుతుంద‌న్నారు. నాసా శాస్త్ర‌వేత్త‌లు, దాని భాగ‌స్వామ్యులు, వ్యోమ‌గాములు .. అంత‌రిక్ష అవ‌రోధాల‌ను అతి సులువుగా ప‌రిష్క‌రిస్తున్నార‌న్నారు. అంతరిక్ష ప‌రిశోధ‌న అంశాల్లో ప్ర‌పంచ దేశాల స‌హ‌కారం చాలా అవ‌స‌రం అని, అది మాన‌వ ప్ర‌గ‌తికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆస్ట్రోనాట్ హేగ్ తెలిపారు.

Related posts