కరోనా తర్వాత ప్రారంభమైన ఐపీఎల్ 2020 తో బెట్టింగ్ కూడా ప్రారంభమైంది. ఈ బెట్టింగ్ కుర్రకారుని తినేస్తున్న మహమ్మారుల్లో ఒకటి. దానిని అదుపుచేయడానికి పోలీసులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎటువంటి లాభం లేదు. దేశంలో బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. దీని కారణంగా రోజుకు ఎందరో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అటువంటి సంఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. 19 సంవత్సరాల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే దానికి సంబందించిన వివరాలను పంజాగుట్ట పోలీసులు అందించారు. సోనుకుమార్ యాద్(19) క్రికెట్ బెట్టింగ్‌లో ఓడిపోవడం వల్ల వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ ఐపీఎల్ బెట్టంగ్‌లో బాగా నష్టం వచ్చినందుకే ఇలా చేశాడని పోలీసుల తెలిపారు. అయితే ఈ కేసును సెక్షన్ 174సీఆర్‌పీసీగా నమోదు చేశారు. ఇంకా విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ బెట్టంగ్‌లను ఆపకపోతే ఇలాంటివి మరిన్ని చూడాల్సి వస్తుందని పంజాగుట్ట స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.
previous post