telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పశ్చిమ బెంగాల్ లో మంత్రిపై దాడి…

 పశ్చిమ బెంగాల్ ఇప్పటికే ఎన్నికల వేడి రగులుకుంది.  అధికార తృణముల్ కాంగ్రెస్ కు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది.  తృణమూల్ కు చెందిన అనేకమంది నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరుతున్నారు.  గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్ పై కొంతమంది దాడికి పాల్పడ్డారు.  ఆ తరువాత నుంచి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇక ఇదిలా ఉంటె, బెంగాల్ కార్మికశాఖా మంత్రి జాకిర్ హుస్సేన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు.  ఈ దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి.  ముర్షీదాబాద్ జిల్లాలోని రంగనాథ్ గంజ్ రైల్వే స్టేషన్ లో రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలబడి ఉండగా ఆయనపై దాడి జరిగింది.  ఈ దాడి జరిగిన వెంటనే ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదిలా ఉంటె, ఉత్తర కోల్ కతాలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు శివాజీ సింగ్ రాయ్, సుబెందు అధికారి, శంకుదేవ్ పాండాలపై కొందరు దుండగులు దాడులు చేశారు.  ఈ దాడుల్లో ముగ్గురు గాయపడ్డారు.  బెంగాల్ లో బీజేపీ నేతలపై దాడులు జరుగుతుండటంతో హుటాహుటిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అర్ధరాత్రి కోల్ కతా కు వెళ్లారు.  అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts