telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తాప్సి సినిమాపై విమర్శకుడి షాకింగ్ కామెంట్స్

Taapsee

ప్రముఖ నటి తాప్సి నటించిన ‘థప్పడ్’ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా చూసినవారంతా బాగుందనే ప్రశంచారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అయితే సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అయితే బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ తాప్సి సినిమాపై నీచమైన కామెంట్స్ చేసారు. ఈరోజు సినిమా చూసిన కమాల్ ట్విటర్‌లో తన రివ్యూని పోస్ట్ చేసారు. “సినిమా చూసిన అరగంటలోపే అసలు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. ఇక ఇంటర్వెల్‌కి వచ్చేసరికి సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను. తూ. నేను సినిమాను వినోదం కోసం చూస్తాను. అంతేకానీ సినిమా చివరి వరకు బోర్ కొట్టి చావడానికి కాదు. ‘థప్పడ్’ సినిమా చూసాక నేను ఒక్కటే చెప్పగలను. ఈ సినిమాతో మగవాళ్లకు, ఆడవాళ్లకు, సమాజానికి ఎలాంటి సంబంధంలేదు. దర్శకుడు అనుభవ్ సిన్హా తన వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా మార్చారు. కానీ అనుభవ్ సర్.. మా పబ్లిక్ జీవితం మీలాగా లేదు. మేం రెండు రూపాయల చిల్లరగాళ్లం. మీరు ఉన్నతమైన వ్యక్తి. కాబట్టి మీ జీవితాన్ని మీ వద్దే ఉంచుకోండి” అని ట్వీట్స్ చేసారు కమాల్.

Related posts