telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీగా పారితోషికం పెంచేసిన బుట్టబొమ్మ

Pooja

వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉంది. గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో పూజా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 2కోట్ల పారితోషికం అందుకున్న ఈ బుట్టబొమ్మ ఇప్పుడు తెలుగులో మూడు కోట్లు డిమాండ్‌ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘జాన్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాలలో నటిస్తున్న పూజాకు తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది ఇప్పుడు. ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో బాలీవుడ్‌ జనాలను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు సల్మాన్‌ఖాన్‌తో నటించనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ చిత్రానికి 4 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసిందట. ఇక పూజా హెగ్డేకు వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ చిత్ర నిర్మాత సాజిద్‌ నడియాలా కూడా ఆమె డిమాండ్‌కు అంగీకరించాడని బాలీవుడ్‌ వర్గాల టాక్.

Related posts