telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆకాశం నుంచి కిందపడ్డ శవం…!?

Kenya-Airways

లండన్‌లోని క్లాపెం జిల్లాలో విమాన ల్యాండ్ గేర్ వద్ద దాక్కుని ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి 3500 అడుగుల ఎత్తు నుంచి కిందపడియాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెన్యా రాజధాని అయిన నైరోబీ ఎయిర్‌పోర్టులో కెన్యా ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ల్యాండ్ గేర్ వద్ద ఓ వ్యక్తి ఎవరికీ తెలియకుండా దాక్కున్నాడు. అలా దాదాపు పది వేల కిలోమీటర్లు ప్రయాణించిన విమానం.. గమ్యస్థానమైన దక్షిణ లండన్‌లోని హీత్‌రో ఎయిర్‌పోర్టు సమీపించడంతో ఒక్కసారిగా ల్యాండ్ గేర్ ఓపెన్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. విమానంలో నుంచి పడిన శవం క్లాపెంలోని బాబ్ రెన్విక్ అనే వ్యక్తి ఇంటి గార్డెన్‌లో పడింది. ఆ సమయంలో బాబ్ రెన్విక్ తన గార్డెన్‌లో సేదతీరుతున్నారు. సరిగ్గా అతనికి మూడు అడుగుల దూరంలోనే ఈ శవం పడింది. పైనుంచి ఏదో పడిందని గమనించిన అతను అక్కడ పడిన శవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 3500 అడుగుల నుంచి పడటంతో మనిషి ఎవరో అనేది కూడా గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అంత ఎత్తు కావడంతో వ్యక్తి గాల్లోనే మరణించినట్టు కూడా తెలుస్తోంది. వలసదారులు ఒక దేశం నుంచి మరో దేశానికి అక్రమంగా వెళ్లేందుకు ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారని అధికారులు చెప్పారు. చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts