telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

2023 నాటికి.. తెలంగాణాలో బీజేపీదే అధికారం .. : లక్ష్మణ్

bjp will capture telangana by 2023 lakshman

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, 2023 నాటికి తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని అన్నారు. ఇందు కోసం పార్టీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ సహా ముఖ్యనేతల ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో భాజపా సాధించిన విజయం పట్ల అడ్వాణీ, సుష్మాస్వరాజ్‌ ఆనందం వ్యక్తంచేశారని తెలిపారు.

ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. భాజపా గెలుపును జీర్ణించుకోలేక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు పరిశ్రమ అంటూ తెరాస రాజకీయ దాడికి దిగుతోందని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణకు భాజపా ప్రభుత్వం చాలా నిధులు కేటాయించిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో పెద్దలతో పాటు కార్యకర్త స్థాయి నేతల వరకు ఆహ్వానిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.

జాతీయ పదాధికారుల సమావేశంలో తెలంగాణలో పార్టీ విజయం సాధించడాన్ని అమిత్‌షా అభినందించారన్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఐఆర్‌ పెంపు, సీపీఎస్‌ రద్దు వంటివి చేస్తే తెలంగాణలో కేసీఆర్‌ వాటిని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. అన్ని పార్టీల నుంచి కూడా నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, మోదీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చేవారికి సాదరంగా ఆహ్వానిస్తామని లక్ష్మణ్‌ స్పష్టంచేశారు.

Related posts