ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన చంద్రబాబుకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటానని సుజనా చౌదరి పేర్కొన్నారు. ఏపీలో రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదాల వల్లే టీడీపీ ఓడిపోయిందని ఆయన అన్నారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడాన్ని తాను తొలి నుంచీ వ్యతిరేకించినట్టు చెప్పారు. చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డానని పేర్కొన్నారు.
మోదీ హయాంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ప్రకటించిన చంద్రబాబు.. అందుకుతగ్గట్టుగా అంచనాలు వేయడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రత్యేక హోదాను సాకుగా చూపించి తప్పుకోవడం సరైనది కాదని పొలిట్ బ్యూరో సమావేశంలోనూ చెప్పానని గుర్తు చేశారు. పొత్తును నిలిపేందుకు అమిత్ షా చివరి వరకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో మోదీ ఎటువంటి అన్యాయం చేయలేదని తాను స్పష్టంగా చెప్పగలనన్నారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందుతున్న ఏకైక జాతీయ ప్రాజెక్టు పోలవరమేనని సుజనా పేర్కొన్నారు.
సీమ ప్రజలకు తాగునీరు ఇవ్వండి.. సీఎం జగన్ కు లోకేశ్ సూచన!