telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముగిసిన బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర..వరంగల్‌కు చేరుకున్న‌ జేపీ నడ్డా

* దిగ్విజయంగా ముగిసిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర.
* భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగించిన బండి సంజయ్.
* 3వ విడత చివరి రోజు 14 కిలోమీటర్లు నడిచిన బండి సంజయ్
* మరి కాసేపట్లో జేపీ నడ్డా, ఇతర జాతీయ నేతలతో కలిసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొనున్న బండి సంజయ్…

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. భద్రకాళి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్‌ చేరుకున్నారు. 22 రోజులపాటు అయిదు జిల్లాల్లో పాదయాత్ర సాగింది. 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 300కు పైగా కిలోమీటర్లు  బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది.. ఉత్కంఠ ఉద్రిక్తల మధ్య మూడో విడత పాదయాత్ర ముగిసింది.

మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ లోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వరంగల్‌ చేరుకున్నారు. మధ్యాహ్నం 3.20 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌ చేరుకున్నారు. కాసేపట్లో భద్రకాళీ అమ్మవారిని దర్శంచుకోనున్నారు. అనంతరం 3.45 నిమిషాలకు ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ వెంకటనారాయణ ఇంటికి వెళ్లనున్నారు.

ఇక సాయంత్రం 4 10 నుంచి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. తరువాత సాయంత్రం 6 గంటకు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు జేపీ నడ్డా చేరుకోనున్నారు. వరంగల్‌ సభ అనంతరం హైదరాబాద్‌ తిరుగు పయనం అవుతారు. రాత్రి 7.30 నిమిషాలకు శంషాబాద్‌ నోవాటెల్‌లో హీరో నితిన్‌తో భేటీ కానున్నారు.

JP Nadda - Mithali Raj: జేపీ నడ్డాతో ముగిసిన మిథాలీ రాజ్ భేటీ.. రాజకీయ అరంగేట్రం చేయనున్నారా?

 ఇదిలా ఉండగా ఇప్పటికే శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జేపీ నడ్డాతో మిథాలీరాజ్‌ సమావేశమయ్యారు. 

 

Related posts