telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ రాజకీయాల్లో ఒకే కులానికే ప్రాధాన్యత: శివరాజ్ సింగ్ చౌహాన్

Shivraj ingh

ఏపీ రాజకీయాల పై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్ పాలన పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు పాలనలానే జగన్ పాలన ఉందని విమర్శించారు. ఏపీ రాజకీయాల్లో కుటుంబం, ఒక కులానికే ప్రాధాన్యత ఇస్తారని విమర్శించారు. బీజేపీలో కుల, మత, కుటుంబ రాజకీయాలకు స్థానం లేదని అన్నారు.

లోకేశ్ ను సీఎంగా చూడాలని చంద్రబాబు ముందుకు సాగుతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని అన్నారు. బాబుకు ఏపీ ప్రజలు తగినబుద్ధి చెప్పారని అన్నారు. మోదీ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, బీజేపీలో చేరేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Related posts