bjp protest at vijayawada

చంద్రబాబు ఆదేశాలతోనే అమిత్‌ షాపై రాళ్లదాడి: కన్నా

31
ప్రధాని నరేంద్రమోడీ పై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ  ధర్నాచౌక్‌లో భారతీయ జనతా పార్టీ నేతలు ధర్నా చేపట్టారు . ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  అలిపిరిలో అమిత్ షా పై  రాళ్లదాడి చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. 
 
టీడీపీలో చేరకపోతే కేసులు బెడతామంటూ పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని యన దుయ్యబట్టారు. పోలీసులు దమన కాండ సాగిస్తున్నారని, అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే బీజేపీ కార్యకర్తలపై ఎదురు కేసులు పెట్టారని కన్నా ధ్వజమెత్తారు.