telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ సర్పంచ్ ల అరెస్టుపై బీజేపీ ఎంపీలు ఫైర్

bandi samjay mp

తెలంగాణలోని జగిత్యాల నిన్న సర్పంచ్ లను అరెస్టు చేసిన ఘటనపై బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ లు ఖండించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో ఈరోజు మీడియాతో వారు మాట్లాడుతూ సర్పంచ్ లను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని వారు వ్యాఖ్యానించారు. సర్పంచ్, కార్యదర్శులకు ఉన్న చెక్ పవర్ ను ఉపసర్పంచ్ కు ఎలా ఇస్తారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. అవగాహన లేకనే సీఎం కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ సర్పంచ్ ల అరెస్టును ఖండిస్తున్నామని అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారి అయివుండి, అధికార పార్టీకి కొమ్ముకాయడం తగదని అన్నారు. స్వచ్ఛభారత్ కింద నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణం, ఎల్ఈడీ బల్బుల పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎంపీలు పేర్కొన్నారు.

Related posts