telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల సమావేశం…

Kishan Reddy

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే చింతల, అంబర్ పేట జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు హాజరయ్యారు. వివిధ డివిజన్ల నుంచి మైనారిటీ మహిళలతో సహా భారీగా యువత పార్టీ లో చేరారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కారు గుర్తుకు ఓటేయమని వస్తే డబల్ బెడ్రూం ఏమైందని అడగండి అని అన్నారు. 2 గదుల ఇళ్ళు ఇస్తామని జీహెచ్‌ఎంసీ లో తెరాస అధికారంలోకి వచ్చింది కరోనా సమయంలో ,వరదల సమయంలో సీఎం ఏం చేశారు అని ప్రశ్నించారు. వరదల్లో 5 లక్షల ఇళ్లల్లో నీళ్లు వస్తే చూడలేదు, చనిపోయిన వారిని ఆదుకోలేదు, ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి సమయం సీఎంకి ఉంటుంది అన్నారు. పీఎం మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తే, మన సీఎం నెలకు 15 రోజులు ఫార్మ్ హౌస్ లో ఉంటాడు అని అన్నారు. సచివాలయం కు రాని సీఎం కేసీఆర్, సెక్రటేరియట్ లేని రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 8 నెలల పాటు కరోన సాయం కేంద్రం అందించమంటే అది కూడా పంపిణీ చేయలేకపోతుంది తెలంగాణ ప్రభుత్వం. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలి. మేము ప్రతి పొదుపు సంఘానికి 20 లక్షల లోన్ ఇస్తున్నాం. జూబ్లీహిల్స్ లో మైనార్టీ ప్రజలు కూడా మనతో ఉన్నారు, మైనార్టీల కు 100 శాతం న్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ. పేద వాళ్ల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ అని అన్నారు. కరోనా తో జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఇంట్లో కూడా పిల్లలు,పెద్దలు ఉంటే మాస్కులు పెట్టుకోండి. వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి అన్నారు. జీహెచ్‌ఎంసీ లో అత్యధిక సీట్లు గెలవాలి.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలి అని పేర్కొన్నారు.

Related posts