ఖాకీ పై ఖద్దరు జులుం

28

మధ్యప్రదేశ్, భోపాల్ లో ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అధికారం ఉందికదా అని తన జులుం చూపించాడు. దేవాస్ జిల్లాలో ని ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకొని ఊరుకోకండా చంపుతానని బెదిరించాడు.

వివరాలలోకి వెళితే బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్డా మేనల్లుడు పోలీస్ స్టేషన్ లోని అనుమతి లేని చోటుకు బలవంతగా వెళ్తుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ సంతోష్ వారించాడు అది తప్పుగా భావించి ఎమ్మెల్యే రంగప్రవేశం చేశాడు, సదరు అధికారిపై తన పెత్తనం చెలాయించాలని చూశాడు.

bjp mla over action in police station

ఈ విషయాలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నమోదు కావటంతో సదరు ఎమ్మెల్యే బాగోతం బైటకి వచ్చింది.

సీసీటీవీ లో ఉన్నదాన్ని బట్టి సంతోష్ ను సదరు ఎమ్మెల్యే రెండు సార్లు చెంపచెళ్ళు మనిపించాడు, నోటికొచ్చినట్టు తిట్టాడు.

ఈ విషయంపై విచారణ చేపడుతున్నట్టు సూపరింటెండెంట్ పోలీస్, అన్షుమన్ సింగ్ చెప్పారు. ఈ ఘటన అర్ధరాత్రి 12 గంటల తరువాత జరిగిందని స్పష్టం చేశారు.

ప్రజలు తమ అధికారాన్ని బదిలీ చేయబట్టి వారికి సేవ చేసుకుంటున్నామనే ఇంగితం నేటి నాయకులలో లేకపోగా అధికారం రాగానే వల్లే రాజులన్నట్టు ప్రజలు బానిసలన్నట్టు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది మారాలంటే ప్రజలు ఇలాంటి మూర్కపు రాజరికాలకు కాకుండా ప్రజా సేవ చేసే నాయకులను ఎన్నుకోవాల్సి ఉంది. అది యువకులైన పరవాలేదు…యువకులంటే రాజకీయనాయకుల ఇళ్లల్లోంచి వచ్చేవారు కాదు, సామాన్య జన్నంలోంచి వచ్చే వారు.

ఇలా ప్రజలపై, అధికారులపై జులుం చెలాయించే వారికి మళ్ళీ ఎన్నికలలో పోటీ కూడా చేయకుండా చట్టసవరణ చేయాల్సిందే అని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.