bjp leaders dinner in bihar

‘బీజెపి’హార్…రాజకీయాలు..

19

నేషనల్ డెమోక్రాట్టిక్ అలియాన్స్ (ఎం.డి.ఏ) బీహార్ నాయకులను కలిసింది. అయితే అక్కడ నాలుగేళ్ళ బీజేపీ, జెడి(యూ), ఎల్.జె.పి మరియు ఆర్.ఎల్.ఎస్.పి పాలనను గురించి చర్చించారు, ఈ చర్చ అంతా డిన్నర్ చేస్తూనే జరిగింది. ఆ తరువాత కనీసం మీడియాతో కూడా మాట్లాడటానికి సుముఖత చూపలేదు.

ఇక ఆర్.ఎల్.ఎస్.పి అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా వేరే పనులు ఉన్నాయంటూ ఈ సమావేశానికి హాజరు కాలేదు, వారికి బదులుగా మరో నాయకుడిని పంపారు.

రాబోయే ఎన్నికల వ్యూహంగా ఈ సమావేశం జరిగిందని ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పేర్కొంది.

నితీష్ కుమార్ మళ్ళీ ఆర్.జె.డి కి వెళ్లడని గారంటీ ఏంటనే ప్రశ్న కూడా జనించింది. ఈ డిన్నర్ కు కుమార్, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ, ఎల్.జె.పి చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్ మరియు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ లు హాజరయ్యారు.

ఇన్ని అడ్డంకులు ఉన్నా బీజేపీ మాత్రం మాకు దేశం అంతా మద్దతుగానే ఉందని దాంభికలకు పోవటం విశేషం. మొత్తానికి ఈ డిన్నర్ సమావేశం అయితే అట్టర్ ప్లాప్ అయినట్టే ఉందని సమాచారం.

ఇక ఆర్.ఎల్.ఎస్.పి సీఎం పదవి కోరుతుండటంతో 2020లో జరిగే ఎన్నికలకు బీజేపీ కి కూటమి సిద్దమవనుందా అనేది ఆలోచించాలిందే.