హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాజీ మంత్రి హరీశ్ రావుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ను యూటీగా చేస్తారని మాట్లాడటం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం హరీశ్ రావు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయనస్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలు తలాతోక లేని వ్యాఖ్యలు చేశారన్నారు.
అంతకుముందు, హరీశ్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కాదని తెలంగాణ క్యాపిటల్ అన్నారు.