బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ… హైదరాబాద్ అనేది ఓ మిని భారతదేశం అని అన్నారు. ఇక్కడ రాజస్థాన్ ,మహారాష్ట్ర, బెంగాల్ కు చెందిన వారు ఎంతోమంది నివసిస్తున్నారు. అయితే ప్రాంతీయ పార్టీలు అన్ని కుటుంబ పార్టీలే… కానీ మోడీ దేశం కోసం పని చేస్తున్నారు అని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికే అన్ని పార్టీ పదవులు.. ప్రజాక్షేత్రంలో ఓడించినా మేనేజ్మెంట్ కోటలో కేసీఆర్ కూతురు కవిత పదవులు దక్కించుకున్నారు అని అన్నారు.కేసీఆర్ మనవడు హిమాన్షుకు కూడా వయస్సు ఉంటే పదవి ఇచ్చే వారు. ముస్లింల కోసం ఎంఐఎం ఏమి చేయలేదు. కరోనా సమయంలో పేద ముస్లింల కోసం ఎంఐఎం ఏమి చేయలేదు అన్నారు. హైదరాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ లా చేస్తామన్నారు. కానీ కల్లాస్ చేశారు. వేలాది కాలనీలు వరదల్లో నీట మునిగాయి. ప్రజలకు తాగు నీరు ఇవ్వరు కానీ బార్లు, వైన్స్ లు తీసుకోండి నాకు ఆదాయం కావాలని కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అని పేర్కొన్నారు. హైదరాబాద్ ను కేసీఆర్ కుటుంబం నుండి కాపాడాలి. కేటీఆర్ విజన్ అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ కనీసం డ్రైనేజి వ్యవస్త కూడా సరిగా లేదు అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
previous post
next post