telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బీజేపీ-జనసేన పొత్తుపై దగ్గుబాటి పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు

ఏపీలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ దేశ సేవకు ప్రతి బీజేపీ కార్యకర్త పునరంకితం కావాలని పిలుపిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారు. ఉత్తర్ ప్రదేశ్ లో రెండో సారి అధికారం ఇవ్వడం అంటే బీజేపీ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటో అర్థమవుతోంది.

మోడీ ప్రధానిగా ఎనిమిదేళ్ళ కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో పేదల అభ్యున్నతికి కృషి చేశారు. ప్రతి కార్యకర్త కూడా పార్టీ గెలుపు కోసం పని చేయాలి. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ , సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రకాశ్ సూత్రంతో ముందుకెళ్తున్నాం అన్నారు. 

అలాగే బీజేపీ-జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు..మిత్ర పక్షంగా పవన్ కళ్యాణ్ మాతో చర్చిస్తే.. మేము కూడా స్పందిస్తామ‌ని అన్నారు. ఏపీలో కార్యక్రమాలు వేరైనా . బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు.

విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులకు బీజేపీని తప్పు పట్టే అర్హత లేదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర పెద్దలకు వివరిస్తాం. రాష్ట్రంలో అధికార దాహంతో చేసే పనులు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. సేవ చేయడం కన్నా.. అధికారమే లక్ష్యంతో పని చేస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు కావాలని ప్రజలు ఎదురు చుస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ ఛార్జీల విషయంలో కేంద్రం తన వంతు బాధ్యతగా ధరలు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విషయంలో ఎందుకు తగ్గించడం లేదని అన్నారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. మా ప్రణాళికలు మాకు ఉన్నాయి… వాటికి అనుగుణంగా పని చేస్తాం అన్నారు పురందేశ్వరి.ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts