telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు వీడనున్న ‘చంద్ర’ గ్రహణం: బీజేపీ నేత లక్ష్మణ్

రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్ర గ్రహణం వీడుతోన్నదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల పై విమర్శలు గుప్పించారు. ఇద్దరు చంద్రులు ఫెడరల్ ఫ్రంట్, ఫ్యామిలీ ఫ్రంట్‌కు టెంటు లేదని తేల్చిచెప్పేశారు. ఒకాయన అడవి బాట పడితే.. ఒకాయన ఢిల్లీ, కోల్‌కత్తా ఇలా భేటీలకు వెళ్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతు అంటున్నారు. కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులు పెట్టుకోవడం ప్రజలు ఒప్పుకోలే ఓటమికి చంద్రబాబు సాకులు వెతుకుతున్నారు.యూటర్న్ మహానుభావుడు ట్యాపరింగ్ జరిగిందని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ఈవీఎంలు విచిత్ర మెంటాలిటీలో చంద్రబాబు ఉన్నారు. ట్యాపరింగ్ జరిగిందని మళ్ళీ నేనే గెలుస్తా అనడం దానికి కొన్ని సంస్థలు, వ్యక్తులు వంతపాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసంతృప్త టీఆర్ఎస్ వాదులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మరింత మంది బీజేపీ వైపు వస్తారని పేర్కొన్నారు.

Related posts