కేంద్ర ప్రభుత్వంపై నిధుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కేంద్రం నుంచి తమకు భారీగా నిధులు రావాల్సి ఉందంటూ సీఎం కేసీఆర్ సహా మంత్రులు కూడా కేంద్రాన్ని ఈ విషయంలో బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులపై చర్చకు సిద్ధమా? అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. తెలంగాణకు నిధులు కేటాయించడంలో కేంద్రం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు.
ఆనాడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం.. ఈనాడు మోదీకి పాదాభివందనం!