హైదరాబాద్‌లోని హయత్ నగర్ లో బీజేపీ నేతలు ఇవాళ ధర్నా చేపట్టారు. విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు.బీజేపీ నాయకులు డీజీపీ ఆఫీస్, ప్రగతి భవన్ ముట్టడిస్తారని అసత్య ప్రచారాలు తమపై కేటీఆర్ చేస్తున్నారని… అందుకే తాము ధర్నా చేపట్టామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. తాము ఎలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా తమ నాయకులను హౌస్ అరెస్టు ల తో పాటు మా హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే తెరాస నాయకుల ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి హెచ్చరించారు. రహదారిపై ఉద్రిక్తతలు నేలకొన్న నేపథ్యంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డితో పాటు సీనియర్ నాయకులు కళ్లెం రవీందర్ రెడ్డి 20 మంది కార్యకర్తలను హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేసారు. కాగా దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ పెద్ద కుట్రకు దిగుతుందని నిన్న మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
previous post
“శాశ్వతంగా లాక్-డౌన్”… రానా పెళ్లిపై అక్షయ్ కుమార్ రియాక్షన్