telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యం..- జేపీ నడ్డా

*ఓరుగల్లు గడ్డకు నా నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించిన జేపీ నడ్డా..
*టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యం..
*మీర్ ఉస్మాన్ అలీఖాన్ దారిలోనే కేసీఆర్ పయనం.
*తెలంగాణ ఏర్పాటుకు మొదట మద్దతు పలికింది బీజేపీనే..

*కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి క‌ల్పిస్తాం
*ఢిల్లీకి పాకిన కేసీఆర్ అవినీతి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాళాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఓరుగల్లు గడ్డకు నా నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణలో నయాం నిజాం పాలన సాగుతుందని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందని విమర్శించారు. తెలంగాణలో వెలుగులు నింపడానికే బండి సంజయ్‌ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర సంకల్పమని జేపీ నడ్డా వ్యాఖ్యనించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందన్నారు. అంధకారమైన తెలంగాణలో వెలుగులు నింపడానికే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట మద్దతు ఇచ్చింది బీజేపీనే అని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ఏర్పాటుకై గల్లీలోనూ, ఢిల్లీలోనూ బీజేపీ ఫైట్ చేసిందన్నారు. బీజేపీ మద్ధతు తోనే పార్లమెంట్‌లో తెలంగాణ పాస్ అయిందని గుర్తు చేశారు నడ్డా.

బీజేపీ సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ సర్కార్ కుట్రలు చేసిందని జేపీ నడ్డా ఆరోపించారు. కానీ, హైకోర్టు అనుమతితో సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టారని విమర్శించారు నడ్డా. 144 సెక్షన్ ఉందని జనాన్ని రాకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని అన్నారు.

మజ్లిస్ భయంతోనే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న విమోచనం దినోత్సవం నిర్వహించడం లేదని నడ్డా విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు కూడా పాకిందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 3,098 కోట్లను ప్రకటించామని, తెలంగాణ మాత్రం రూ. 200 కోట్లే తీసుకుందని నడ్డా ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తుందన్నారు.

త్వరలోనే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారుని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. . మీర్ ఉస్మాన్ అలీఖాన్ దారిలోనే కేసీఆర్ పయనిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలే పెట్టారని అన్నారు .నిజాం తరహాలోనే కేసీఆర్‌ను ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు.

Related posts