*రాష్ట్రాల్లో ఇంకా కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయి
*ఏపీలో వైసీపీ, టీడీపీ కుటుంబ పాలనే..
*తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుంది..
రాష్ర్ట రాజకీయాల్లో కొన్ని కుటుంబాల నుంచి దేశాన్ని రక్షించేందుకు బీజేపీ పోరాడుతోందని జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఏపీకి చేరుకున్న జేపీ నడ్డా.. విజయవాడలో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో ఇంకా కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయని.. వాళ్లను కచ్చితంగా ఓడించి సరికొత్త భారతావని నిర్మించాలన్నారు.
కుటుంబ పాలన దేశ, రాష్ట్రాభివృద్ధికి ప్రమాదకరమని ఆరోపించారు నడ్డా ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌లో కూడా కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు జేపీ నడ్డా. టిడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ అదే కోవలోకి వస్తాయన్నారు. పక్కరాష్ట్రం తెలంగాణలో టీఆర్‌ఎస్‌లో కూడా అదే చూస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం ఇస్తున్న డబ్బులతోనే పాలన సాగుతోందన్నారు బీజేపీ చీఫ్ నడ్డా.. అందుకు ఉదాహరణగా ఆయుష్మాన్ భారత్ పేరు ప్రస్తావించిన నడ్డా. ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రజల కోసం గొప్ప ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తే దాన్ని ఆరోగ్య శ్రీగా పేరు మార్చి జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు..
ఆయుష్మాన్ భారత్ పథకంతో ఐదు లక్షల వరకు వైద్య సాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ లీడర్లు, కార్యకర్తలకు నడ్డా పిలుపునిచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఎక్కడైనా పని చేస్తుందని…. ఆరోగ్య శ్రీ రాష్ట్రం పరిదిలోనే పని చేస్తుందన్నారు.
మేం రాజకీయాలను చచ్చినా వదిలిపెట్టం: నాగబాబు