telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రియాంక అందగత్తే కానీ ఆమెకు రాజకీయాలు తెలియవు: బిహార్‌ మంత్రి

Priyanka Gandhi started Ist road show

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బిహార్‌ మంత్రి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందగత్తే కానీ ఆమెకు రాజకీయంగా ఎలాంటి నైపుణ్యం లేదని బీహార్‌ మంత్రి వినోద్‌ నారాయణ్‌ ఝా వ్యాఖ్యానించారు. అందమైన ముఖం చూపి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

భూ కబ్జాలు, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్‌ వాద్రా భార్య ప్రియాంక కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ఆమె చాలా అందంగా ఉంటుంది కానీ రాజకీయంగా ఆమెకు ఎలాంటి అనుభవంలేదని ఝా వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Related posts