telugu navyamedia
సినిమా వార్తలు

‘బిగ్ బాస్’ సీజన్ 6 ఎంటర్‌టైన్మెంట్‌కు అడ్డా ఫిక్స్..అదిరిపోయిన ప్రోమో

బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 6’ వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ‘స్టార్ మా’ ఛాన‌ల్ ఆసక్తికరమైన ప్రోమో విడుదల చేయడం జరిగింది.  వివిధ భాషల్లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్.. తెలుగులోనూ టాప్ రేటింగ్ తో సూపర్ హిట్ అయ్యింది .ఇప్పటికే ఈ షో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

గత మూడు సీజన్స్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్ చేయనున్నారు. ఇటీవలే అఫీషియల్ గా బిగ్ బాస్ సీజన్ 6 ను అనౌన్స్ చేసిన నిర్వాహకులు తాజాగా ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ కార్యక్రమం త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుందని అతను ధృవీకరించాడు.

ఇక ‘బిగ్ బాస్-6’ ప్రోమో విషయానికి వస్తే.. పెళ్ళికూతురు అప్పగింతలు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవ్వుతున్నారు. “మా ఇంటి మహాలక్ష్మిని పంపించడం నా వల్ల కావడం లేదమ్మా’’ అని తండ్రి ఏడుస్తుంటే.. ‘‘మిమ్మల్ని వదిలి వెళ్ళడం నా వల్ల కావడం లేదు నాన్న మీరు కూడా నాతో రండి” అని పెళ్లి కూతురు ఏడుస్తుంది. అప్పుడే తల్లి ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఇంకేముంది పెళ్లి కొడుకుతో సహా అంతా మాయమైపోతారు.

అప్పుడే కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చేస్తారు. “అప్పగింతలు అయ్యేవరకు కూడా ఆగలేకపోయారంటే.. అక్కడ ఆట మొదలైనట్లే” అని నాగ్ చెబుతారు. పెళ్ళికొడుకుతో సహా అందరూ టీవీకి అతుక్కుపోతారు. లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే. ‘బిగ్ బాస్’ సీజన్ 6 ఎంటర్‌టైన్మెంట్‌కు అడ్డా ఫిక్స్” అని నాగ్ చెప్పే డైలాగ్ తో ప్రోమో ముగుస్తుంది. ఈ ప్రోమో అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

Related posts