telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : హిమజ డ్యాన్స్ పై పునర్నవి కామెంట్స్

punarnavi targeted this week in bigg boss 3

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఫైనల్ కి ఇంకా నాలుగు వారాలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో హౌజ్ లో జరిగే సంఘటనల ద్వారా ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారట బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ఎప్పుడైనా అనుకోని సంఘటనల్ని చొప్పించి ట్విస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అయితే మరోసారి ఆ దిశగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ డబల్ ఎలిమినేషన్ రూపంలో ఉండనుందని సమాచారం. ఈ వారం నామినేషన్ లో ఉన్న ముగ్గురిలో మహేష్ ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే మహేష్ తో పాటు వరుణ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గత ఆదివారం పునర్నవి భూపాలం ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె బయటకు రావడంతో బిగ్ బాస్ 3 కంటిస్టెంట్ హిమజ మాత్రం తీన్ మార్ డ్యాన్స్ వేస్తూ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచింది. అప్పట్లో హిమజ పలు ఇంటర్వ్యూలో తనను ఇంటి సభ్యులు చాలా అవమానించారని, ప్రతి విషయంలో తనను టార్గెట్ చేశారని, ముఖ్యంగా పునర్నవి అయితే రూడ్ గా వ్యవహరించేదని ఆరోపించింది. పున్నూ తో ఎంత సన్నిహితంగా ఉండాలని చూసినా కొంత కాలం తనతో మాటలు కూడా కట్ చేసిందని ఆవేదన చెందింది. ఈ నేపథ్యంలో పున్నూ ఎలిమినేట్ కావడంతో హిమజా పట్టరాని ఆనందం పొందింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన పునర్నవి ‘అది ఊహించిన విషయమే’ అని కొట్టిపారేసింది. హిమజ ఎందుకు అలా చేసిందో తననే అడుగుతానని, దానితో వాదనలో ఎవరూ గెలవలేరని చెప్పుకొచ్చింది.

Related posts