telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ 3 తెలుగు : .. ఈవారం బైటికెళ్లే వారిలో ..

Bigg-Boss

బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఈ వారంలోనూ ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వుండగా, నామినేషన్ ప్రక్రియ కాస్తంత వెరైటీగా జరిగింది. కెప్టెన్‌ శివజ్యోతి మినహా మిగతా 10 మందిని ఇద్దరేసి చొప్పున 5 గ్రూపులుగా విభజించిన బిగ్ బాస్, ఇద్దరిద్దరిని నామినేట్ చేయవలసిందిగా ఆదేశించాడు. ఇక వీరి నుంచి మహేశ్ పేరు అత్యధికంగా వినిపించింది. ఆపై హిమజ, మహేశ్, రవి, రాహుల్, పునర్నవిలు నామినేట్ అయ్యారు.

మిగిలిన ఐదుగురిలో ఒకరిని డైరెక్ట్‌ గా ఎలిమినేషన్ కు నామినేట్ చేయాలని శివజ్యోతిని బిగ్ బాస్ కోరగా, ఆమె వరుణ్ ను నామినేట్ చేసింది. ఇక, ఈ నాలుగు రోజుల తరువాత ఆదివారం నాడు వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు.

Related posts