బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం ఎపిసోడ్‌తో సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు (ఏడు వారాలు) పూర్తి చేసుకుంది. ఈ వారం శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, శ్రీముఖి లలో ఒకరు ఇంటి నుండి వెళ్ళనున్నారు. ఎపిసోడ్ 52లో ఇంటి సభ్యులకి ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఐదు దెయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు ఉంటారు. మనుషులుగా ఉన్న వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రవి, మహేష్‌లకు వారు విసుగుతెప్పిస్తూ ఉండాలి. అయితే రెండు దశలుగా ఈ టాస్క్ జరగనుండగా, మొదటి దశలో ముగ్గుర్ని చంపాల్సి ఉంటుంది. ఇలా చేస్తే చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా.. చంపిన వాళ్లు మనుషులుగా మారతారు అని బిగ్ బాస్ పేర్కొన్నారు. టాస్క్‌లో భాగంగా రంగంలోకి దిగిన దెయ్యాలు ఇంట్లో తెగ లొల్లి చేశారు. కేకలు పెడుతూ వికృత చేష్టలతో మిగతా వారి సహనాన్ని పరీక్షించారు. వితికాకి ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఆమె… వరుణ్‌కి మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్‌పై వరుణ్ గోస్ట్ రాస్తుంది. దీంతో వితికా మాములు మనిషిగా మారుతుంది. వరుణ్ చనిపోయి దెయ్యంగా మారుతాడు. ఇక హిమజ .. శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టడం.. శిల్పా చక్రవర్తి.. పునర్నవిని పూల్‌లోకి తోసేయడంతో హిమజ, శిల్పాలు మనుషులుగా మారి శ్రీముఖి, పునర్నవి దెయ్యం అవతారం ఎత్తుతారు.
అయితే పునర్నవిని పూల్‌లోకి తోసే సమయంలో శిల్పా చక్రవర్తి తనతో దురుసుగా ప్రవర్తించిందని ఫైర్ అయింది పునర్నవి. వారు ఏం చేసిన రియాక్ట్ కావొద్దని బిగ్ బాస్ చెప్పడంతో, టాస్క్‌లో ఉన్నంత సేపు కామ్‌గా ఉన్న పున్ను ఆ తర్వాత ఫైర్ అయింది. ఇలాంటి గేమ్స్ ఎలా ఇస్తారు, వారు ఏం చేస్తున్నా కూడా సైలెంట్‌గా ఎలా ఉంటారు. బిగ్ బాస్ ఇది బుల్ షిట్ టాస్క్. మీ ఆటను మీరే ఆడుకోండి. మాకు చెప్పింది ఏంటి ఇక్కడ చేస్తుంది ఏమిటి? నన్ను రెండు సార్లు తోస్తుంటే ఏం చేస్తున్నారు. నన్ను ఈడ్చుకుంటూ పోతుంటే బాధ ఉండదా? అంటూ బిగ్ బాస్‌కే వార్నింగ్ పునర్నవి. ఇక ప్రస్తుతం దెయ్యాలుగా ఉన్న మిగతా వారు రవిని డాన్స్ వేసేట్టు చేయాలి, మహేష్‌ని ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా ప్రయత్నించాలి. మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాలి. వీక్లీ టాస్క్‌లో భాగంగా ‘ ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ప్రేక్షకులకి కాస్త విసుగు తెప్పించేలా ఉంది. మరి నేటి ఎపిసోడ్ అయిన కాస్త ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందా అనేది చూడాలి.