bigg boss telugu season 2 contestants

సభ్యుల గృహ ప్రవేశం నేడే…

190

బుల్లి తెరపై రారాజు బిగ్ బాస్ రెండవ సీజన్ ప్రారంభ తేదీని వెల్లడించారు. ఈ కార్యక్రమం జూన్ 10 నుండి ప్రారంభం అవనుందని అధికారికంగా ప్రకటించారు. ఈసారి ఇంకొంచం మసాలా…అంటూ నటుడు నాని కూడా వ్యాఖ్యాతగా సిద్దమైపోయాడు. ఎన్నో ఎంట్రీలు, ఎంతోమంది పోటీ పది చివరికి 16 మంది సెలెబ్రెటీస్ తో దాదాపు 100 రోజులు పాటు ఒక్క బిగ్ హౌస్ లో ఈ కార్యక్రమం బుల్లి తెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైపోయింది.

రేపటి నుండే ఈ షో మొదలవుతుంది. బిగ్ బాస్ 2 పోటీదారుల జాబితాలో కొనసాగుతున్న సస్పెన్సుని వీడనుంది. కొన్ని ద్రువీకరించబడిన పేర్లలో పాల్గొనే వారి జాబితా ప్రముఖ గాయని గీతా మధురి, అమిత్ తివారీ, టీవీ యాంకర్ దీప్తి, నటుడు తనీష్, బాబు గొగ్గినేని, భాను, రోల్ రిధా, శ్యామల, కీర్తి దామరాజు, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, మరియు సామ్రాట్ ఉన్నారు. ఈ 13 మంది సెలబ్రిటీలు కాకుండా గణేశ్‌‌, సంజన, నూతన్‌ నాయుడు అనే ముగ్గురు కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం.

ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ షో ప్రారంభం కాబోతోంది. సెకండ్‌ సీజన్‌ వంద రోజులపాటు సాగనుంది. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ తెరమీదికి వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్‌ ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందో చూడాలి.