big boss

బిగ్ బాస్ లో 4వ రోజు రైస్ కుక్కర్ ప్లగ్ తీసింది ఎవరు ?

27

బిగ్ బాస్ 2 సీజన్ మొదలైనప్పటి నుండి ప్రేక్షకులు ఆ కార్యక్రమ సమయానికి టీవీ లకు అతుక్కుపోతున్నారు. అసలు ఎవరైనా గొడవలు పడుతుంటే చూడటం అంటే మనవాళ్ళకి ఇంత ఇష్టం అని ఎవరు కనిపెట్టారో కానీ అప్పటినుండి ఇటువంటి షో లు ప్రారంభించారు కొందరు. ఇక ప్రస్తుత బిగ్ బాస్ షో విషయానికి వస్తే, రోజులు పెరిగే కొద్దీ బిగ్ బాస్ లో గొడవలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు గెలుపు కోసం కష్టపడుతున్నారు. మొన్నటి దాకా సేవకులుగా ఉన్నవాళ్లు నిన్నటి ఎపిసోడ్ లో యజమానులుగా అవతారం ఎత్తారు. ఇక బిగ్ బాస్ లో హైలైట్ గా ఉన్న బాబుగోగినేని ఫై ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడు గలగలా మాట్లాడే తేజస్వికి మౌన వ్రతం పనిష్మెంట్ ఇచ్చారు. కిరీటికి ఇంట్లోవాళ్ళు గుర్తుకు రావడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. మొత్తంగా నాలుగోరోజు బిగ్ బాస్ హౌస్ లో అలకలు, ఆటలు, ఆరోపణలతో చాలా సరదాగా గడిచిపోయింది. యజమానులు సేవకులు కాన్సెప్ట్ నాలుగోరోజు కూడా కంటిన్యూ అయ్యింది. సేవకులను ఎలాగైనా ముప్పు తిప్పలు పెట్టాలనుకున్న యజమానులు టీం సేవకులను క్యాట్ వాక్ చేయించారు.

big boss 4th dayఅయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు-ఆడవాళ్లు మొగవాళ్ళ లాగా, మొగవాళ్ళు ఆడవాళ్ళలాగా మేకప్ వేసుకొని క్యాట్ వాక్ చేయాలి. ఇందుకోసం సేవకులు టీం మేకప్ వేసుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. అయితే సేవకులు టీం క్యాట్ వాక్ చేస్తూ రావడం డైలాగు చెప్పడం నిన్నటి షో లో హైలైట్ గా నిలిచింది, ఇందులోనూ మొదలు క్యాట్ వాక్ సింగల్ గా చేయాలి తరువాత జంట గా చేయాలి. శ్యామల, దీప్తి, అమిత్, నూతన్ చేసిన కామెడీ అందర్నీ అలరించింది. బిగ్ బాస్ అంటే కామిడీ అని అంతకంటే ఎక్కువేనని నాని మొదట్లోనే చెప్పారు. టీం సభ్యులంతా చట్ వాక్ చేస్తుంటే తాను మాత్రం క్యాట్ వాక్ చేయనని ఖరాకండిగా చెప్పారు బాబు గోగినేని తన అవయవాలు ప్రదరించేలా చట్ వాక్ చేయనని తేల్చి చెప్పారు. అయితే ఏ సమయంలో రైస్ కుక్కర్ ప్లగ్ ని ఎవరో తీసేసారు అది గోగినేని చేసి ఉంటాడని కొందరు అనుమాన పడ్డారు, ఇందుకు గోగినేని తాను అలాంటి పనులు చేయనని తనకు ఆ అవసరం లేదని అన్నారు.

 

Babu_Gogineni_2018

 బిగ్ బాస్ వ్యాఖ్యాతగా మొదటి సీసన్ లో ఎన్ టీ ఆర్ అదరగొట్టగా ఏమీ తగ్గకుండా సీసన్ 2 లో నాని చేస్తున్నాడు, ఎన్టీఆర్ బాగా చేశాడా నాని బాగా చేస్తున్నాడా అని చర్చలు కూడా మొదలైయ్యాయి.