పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ , దగ్గుపాటి రాణా కలిసి నటిస్తోన్న సినిమా భీమ్లా నాయక్ . సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందినఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడిగా నిత్యా మీనన్, రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటించారు.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డ్స్ తిరగరాస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేసింది.
అదే రేంజ్ లో రెండో ట్రైలర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు చిత్రయూనిట్. ఈ సరికొత్త ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి ట్రైలర్ లో లేని కొన్ని సన్నివేశాలను ఈ ట్రైలర్ లో యాడ్ చేశారు. మొత్తంగా ఈ ట్రైలర్ కూడా సినిమా పై అంచనాలను పెంచేసింది. భీమ్లానాయక్ వర్సెస్ డానియల్ శేఖర్… ఎవరికివారు అన్నట్టుగా సాగే కథను కనెక్టివిటీ కట్టవకుండా డిజైన్ చేశారు డైరెక్టర్.
ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.