ఓ స్వప్న మనోహరీ!
నా ప్రేమ భావసుందరీ!
కలల కడలిలో వలపుల తలపుల అలలు రేపుతావు
మేను మేఘాలలోని అందాలను ఒలకబోసి
అంతరంగపులోతుల్లో ప్రేమ తరంగాలు సృష్టిస్తావు
మనసును భ్రమరం చేసి
నీ చుట్టు త్రిప్పుకుంటావు
వలపుల వసంతంలో మత్తికోకిలవై ప్రేమగీతాలు వినిపిస్తావు
గుండెలో ప్రేమ ఊసుల శ్వాసలు
నింపి ఊహలపల్లకీలో ఉరేగిస్తావు
నిశ్శబ్ద రాత్రుల్లో
మనసులో మమేకమై తనువులోని అణువణువుల
ప్రేమ స్పర్శలు ప్రసరింప చేసి
స్వర్గలోకపు అంచుల్లోకి
తీసుకెళ్తావు
నా హృదయకోవెలలో
ప్రేమ ప్రమిదవై వెలుగుతావు
దరహాసపు ఆకాశంలో
మిలమిల మెరిసే తారవైతావు
నా గుండె గూటిలో
ప్రేమ పావురమై పవళిస్తావు
కనులకొలనులో కలువ పూవువై వికసిస్తావు
జీవితాకాశాన మెరుపుతీగవై
కనిపిస్తావు
స్వప్న సుందరీ!
నా ప్రేమ మంజరీ!!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు
నిర్మాత పడకగదికి రమ్మన్నాడు…నటి ఆరోపణలు