కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమావేశం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి కళ్యాడపు ఆగయ్య అధ్యక్షతన ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో జరిగినది.
ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని కళ్యాడపు ఆగయ్య ఎగరవేసీన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి నారు.
ఈ సందర్భంగా కళ్యాడపు ఆగయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పెన్నిధి ఎన్టీఆర్ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిననాయకుడు
ఈ దేశంలో ఎన్టీఆర్ తప్ప మరొకరు లేరు ఎన్టీఆర్ కు ఏనాడో ఇవ్వాల్సిన భారతరత్న అవార్డు నేటివరకు ఇవ్వక పోవడ సిగ్గుచేటు అయన జయంతి రోజున ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేసి నారు.
పేద వాడికి రెండు రూ.కిలో బియ్యం ఇచ్చిన ఘనత మహానాయకుడు ఎన్టీఆర్ దే, నితిమంతమైనపాలన అందించిన ఘనత ఎన్.టీ.రామారావు గారిది అన్నారు.
ఈ సమావేశం నందు రెండు తీర్మానాలను ఆమోదించడం జరిగినది. ముందుగా. మహానాయకుడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించి తొమ్మిది మాసాల్లోనే అధికారం చేపట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తు తీర్మానించి నైనది.
మరో తీర్మానం.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101. వ జయయంతి కార్య క్రమాన్ని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అద్వ ర్యంలో కళ్యాడపు ఆగయ్య ఆధ్వర్యాన నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉదయం 10. గం.కు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించ బడును.
కావున నియోజకవర్గంలోని పార్టినాయకులు, పార్టీ కార్యకర్తలు అన్న గారి అభిమానులు, పార్టీ అభిమానులు అందరు మీరు తప్పక పాల్గొని విజయవంతం చేయాలని తిర్మాణించనైనది.
అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగురవేసి అన్న గారి చిత్ర పటానికి పుల మాల వేసీ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది .
ఈ సమా వేశంలో పాల్గొన్న పార్టీ ముఖ్యనాయకులు. కళ్యా డపు ఆగయ్య,సంధభోయిన రాజేశం,ఏర్రోజు హయగ్రీవచారి, తాటికొండ శేఖర్, ఇట్ట మల్లేశం, సాన రామేశ్వర్ రెడ్డి, మేకల రాయమమల్లు తదితరులు పాల్గొన్నారు.