telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

భారత్‌ గ్యాస్‌ రీఫిల్‌ బుకింగ్‌ కోసం ‘గో డిజిటల్‌’

Bharatgas lpg

రీఫిల్‌ బుకింగ్‌ కోసం భారత్‌గ్యాస్‌ వినియోగ దారులకు దేశ వ్యాప్తగా ‘గో డిజిటల్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో వినియోగ దారులకు అవసరమైన వెసులుబాట్లు రీఫిల్‌ బుకింగ్‌ కోసం వాట్స్‌యాప్‌ నెం. 1800224344కి హాయ్‌ అని పంపించడం లేదా 77109-55555కి మిస్‌కాల్‌ ఇవ్వడం వంటి అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది.

సిలిండర్‌ సొమ్మును చెల్లించేందుకు లేదా రీఫిల్‌ బుకింగ్‌ కోసం భారత్‌గ్యాస్‌ మొబైల్‌యాప్‌ను కానీ ఆమెజాన్‌ పేని కానీ పేటిఎంకానీ, ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి ఉపయోగించుకునే అవకాశం వుంది. ఇది కేవలం వినియోగ దారుల సౌకర్యార్ధం , దేశంలో ప్రబలుతున్న మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు దేశ వ్యాప్తంగా భారత్‌ పెట్రోలియం ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts