నటరత్న, పద్మశ్రీ ఎన్.టి. రామారావు గారు నటించిన హిందీ డబ్బింగ్ చిత్రం సాగర్ ఫిల్మ్స్ వారి “భగవత్” సినిమా 14-08-1981 విడుదలయ్యింది.
నిర్మాత సి.హెచ్.సీతారామరాజు సాగర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దర్శకుడు బి.విఠలాచార్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈచిత్రానికి స్క్రీన్ ప్లే,దర్శకత్వం: బి.విఠలాచార్య, మాటలు: ఎస్.ఎన్.సిన్హా బ్రజేష్, పాటలు: ప్రేమ్ ధావన్.
సంగీతం: టి.వి.రాజు, ఫోటోగ్రఫీ: ఎస్.ఎస్.లాల్, కళ: కళాధర్, నృత్యం: చిన్ని,సంపత్, ఎడిటింగ్: బాబు,కె.గోవింద స్వామి, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, దేవిక, జయలలిత, రాజనాల, ప్రభాకరరెడ్డి, రాజబాబు, అల్లు రామలింగయ్య, త్యాగరాజు, మిక్కిలినేని, రావి కొండలరావు, జగ్గారావు, నల్ల రామమూర్తి, హేమలత, టి.జి.కమలాదేవి, రమాప్రభ, రాజేశ్వరి తదితరులు నటించారు.
సంగీత దర్శకుడు టి.వి.రాజు గారు స్వరపరచిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
1969 లో విడుదలైన నందమూరి తారక రామారావు గారు ద్విపాత్రాభినయం చేస్తూ నటించిన “గండికోట రహస్యం” తెలుగు చిత్రాన్ని హిందీలోకి డబ్బింగ్ చేసి “భగవత్” పేరుతో 1971 ఆగస్టు 14 వ తేదీ విడుదల చేశారు.
హిందీ లో కూడా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.
బిగ్బాస్ సీజన్ 4పై నాగార్జున ఎమోషనల్ కామెంట్..