telugu navyamedia
రాజకీయ

ఉత్తమ ఎమ్యెల్యేగా బీఎస్ యెడియూరప్ప..

క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి , బీజేపీ అగ్ర‌నాయుకుడు బీఎస్ యెడియూరప్ప అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.బీఎస్ యెడియూరప్పను 2020-21 సంవత్సరానికి గాను ఉత్తమ ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎంపిక చేసింది.

Bengaluru: Lok Sabha Speaker Om Birla presented BEST MLA award to Former CM  and BJP MLA

ఈ నేపథ్యంలో జ‌రిగిన పుర‌స్కార ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు జ్ఞాపికను బహూకరించారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తియేటా ఉత్త‌మ పార్ల‌మెంట‌రియ‌న్‌గా అవార్డుల మాదిరిగా ఈ సారి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఎమ్మెల్యేల‌కు ఉత్త‌మ శాసనసభ్యుడి అవార్డు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.ఈ మేర‌కు మొట్ట‌మొద‌టి ఎమ్మెల్యే అవార్డు పేరుపొందిన బీఎస్ యెడియూరప్ప ద‌క్క‌డం విశేషం.

B.S. Yediyurappa presented Best Legislator Award - The Hindu

ఈ సందర్భంగా సభలో ఓం బిర్లా మాట్లాడుతూ..రాజ్యాంగ రూపకల్పన సమయంలో శాసనసభ్యలు మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా, నిజాయితీగా, కర్తవ్యబద్ధులై ఉండాలని నిపుణుల కమిటీ ఆశించిందని, తద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక అభ్యున్నతకి మార్గం సుగమం అవుతుందని భావించిందని అన్నారు. ”మనం రూపొందించే చట్టాలపై విస్తృతంగా చర్చ జరపాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎమ్మెల్యేలంతా చురుకుగా వీటిల్లో పాల్గొనాలి. అప్పుడే మనం రూపొందించే చట్టాలపై ఎలాంటి ప్రశ్నలకు తావుండదు” అని ఓం బిర్లా అన్నారు.

Bengaluru: Lok Sabha Speaker Om Birla presented BEST MLA award to Former CM  and BJP MLA BS Yeddyurappa during joint session of the Legislative Assembly  at Vidhana Souda, also seen are Karnataka

కాగా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగం కోసం నిర్వహించిన ఉమ్మడి సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఇలాంటిది మునుపెన్నడూ జరుగలేదని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య అన్నారు. కర్ణాటక శాసనసభలో కొత్త విధానాన్ని సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

Related posts